Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్ బ్యూరో
జేపీఎస్‌ల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వారిని చర్చలకు పిలిచేది లేదని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. విధుల్లో వున్న జేపీఎస్‌ల జాబితాను శనివారం మధ్యాహ్నంలోపు పంపాలంటూ కలెక్టర్‌ను ఆమె ఆదేశించారు. సమ్మె విరమించని వారితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, వారి స్థానంలో తాత్కాలిక కార్యదర్శులను నియమించాలని సూచించారు. ఏ గ్రామంలో అయితే సెక్రటరీలు విధులకు హాజరుకాలేదో అదే గ్రామానికి చెంది.. డిగ్రీ పూర్తిచేసి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారిని తాత్కాలిక ప్రాతిపదికన సెక్రెటరీలుగా నియమించాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు.