Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లండన్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన భారత హైకమిషనర్ విక్రం కె.దురైస్వామి ఆధ్వర్యం లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన పలు కంపెనీల ప్రతినిధులు, ఇతరులకు తెలంగాణలోని పెట్టుబడి అవకాశాల గురించి వివరించారు. రాష్ట్రంలో ప్రాథమిక సమస్యలన్నింటిపై దృష్టి సారించి, వాటి పరిష్కారానికి ప్రయత్నించామని అన్నారు. అనంతరం ఇన్నోవేషన్, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపైన తొమ్మిదేండ్లుగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి వ్యవసాయ రంగం, ఐటీ నుంచి మొదలుకుని అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంత మైందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో అనుమతుల విధానం గురించి ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. అత్యంత వేగంగా, పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ఈ విధానం ఇప్పటికే అనేక ప్రశంసలను అందుకుందని, ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ ఆధారిత కంపెనీల పెరుగుదలతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకా శాలు లభించాయని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మొబిలిటీ, టెక్స్టైల్ వంటి రంగాలలో ఉన్న పెట్టుబడి అవకాశాలను కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఇన్నోవేషన్ ఎకో సిస్టం, పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు, ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలతో ఆయా రంగాల్లో అభివృద్ధి వేగంగా కొనసాగుతు న్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూకే విద్యాసంస్థలు కింగ్స్ కాలేజ్, క్రాన్ ఫీల్డ్ యూని వర్సిటీ వంటి ప్రసిద్ధ సంస్థలతో చేసుకున్న భాగస్వా మ్యాల ఏర్పాటును ప్రస్తావించారు. రాష్ట్రానికి పెట్టు బడులతో ముందుకు రావాలని, అలాంటి సంస్థలకు సహకరించేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇండియన్ హై కమిషనర్ విక్రమ్ కే దురైస్వామి మాట్లాడుతూ హెవీమిషనరీ, ఏవియేషన్, డిఫెన్స్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో యూకే కంపెనీలతో భాగస్వామ్యాలకు ఉన్న అవకా శాలను వివరించారు. ప్రపంచ స్థాయి మౌలిక వస తులు, విభిన్న సంస్కతుల సమ్మేళనమైన తెలం గాణ.. పెట్టుబడులు పెట్టేందుకు ఒక అద్భుతమైన గమ్య స్ధానమని తెలిపారు. తొమ్మిదేండ్లలో సాధిం చిన అద్భుతమైన ప్రగతిని బ్రిటిష్ భారత వ్యాపార వేత్త కరెంట్ బిల్లీమోరియా ప్రస్తావించారు. నూతన సచివాలయం, డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహం వంటి వాటిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రగతి, ముఖ్యంగా ఆర్థిక ప్రగతి, సంపద సృష్టి వంటి అంశా లను వివరించారు. తన సొంత రాష్ట్రం తెలంగాణ ఎదుగుతున్న తీరుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఎన్నారై అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి ఈ.విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ ఆధ్వర్యంలో
టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ పర్యటన విజయ వంతంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ఏర్పాటు చేసేం దుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ముందుకొచ్చింది. ఈ కేంద్రం ఏర్పాటుతో సుమారు 1000 మందిని ఈ ఏడాది చివరి నాటికి నియమిం చుకోనున్నట్టు సంస్ధ తెలిపింది. మంత్రి, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ సీఐఓ అంతోని మేక్ కార్తీతో జరిగిన సమావేశం అనంతరం ఈ విషయాన్ని ప్రకటిం చారు. హైదరా బాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సంబంధించిన ఒక అవగాహన ఒప్పందాన్ని పరి శ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్, ఎన్నారై అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, అంతోనీ మెక్‌కార్తీ మధ్య మంత్రి కేటీఆర్ సమక్షంలో జరిగింది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసే టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ ద్వారా హైదరా బాద్ నగరంలోని బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగానికి అద్భుతమైన ఊతం లభించ నుంది. ఈ రంగంలో హైదరాబాద్ నగరంలో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించనుంది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ ప్రపంచంలో 70 దేశాలలో ఫైనాన్షియల్ మార్కెట్ రంగంలో కార్యకలా పాలను నిర్వహిస్తున్నది. 190 దేశాల్లోని తన ఖాతా దారులకు సేవలను అందిస్తున్నది. తన విస్తతమైన కార్యకలాపాలతో ప్రపంచంలోని ఫైనాన్షియల్ సేవారంగంలో దిగ్గజ సంస్ధగా లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ ఒకటిగా నిలిచింది.