Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దపల్లిలో ఘటన...విషమంగా ఆరోగ్యం
నవతెలంగాణ-పెద్దపల్లి
తన సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఓ రైతు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ధర్మారం మండలం ఖిలా వనపర్తికి చెందిన రామచంద్రారావు తన భూమి పత్రాల ఫోర్జరీ గురించి అధికారులకు తెలిపేందుకు కలెక్టరేట్‌కు వచ్చాడు. ఎంతసేపైనా అధికారులెవరూ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెంది కార్యాలయం ఆవరణలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని పోలీసులు, స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అన్నదమ్ముల మధ్య భూ వివాదం ఉందని, ఇందులో భాగంగా పత్రాలను ఫోర్జరీ చేశారని రామచంద్రరావు ఆరోపిస్తున్నారు.