Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఒకే రోజు ముగ్గురు రైతలు మృతి చెందినా కేసీఆర్ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించటం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కేసీఆర్ రైతుల పట్ల హంతకుడిగా మారారని తెలిపారు. డిగ్రీ చదివి నాలుగేండ్లయినా ఉద్యోగం రాక శివకుమార్ ఉరేసుకుంటే.. 20 రోజులైనా వడ్లకు కాంటాలు వేయకపోవటంతో రైతు ఎల్లయ్య గుండె ఆగి చనిపోయారని పేర్కొన్నారు. 15రోజులుగా సమ్మె చేస్తున్నా.. సర్కారు స్పందించక పోవటంతో జీపీ కార్యదర్శి సోనీ తనువు చాలించిందని ఆందోళన వ్యక్తం చేశారు.