Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ సమస్యల
- పరిష్కారం కోసమే 'ధరణి'
- భూ యాజమాన్యానికి భరోసా
- భూముల క్రయ విక్రయాల నమోదు
- విమర్శలు చేయడం కిషన్‌రెడ్డికి తగదు
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైెర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'దశాబ్దాల కాలం నుంచి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ రికార్డుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 'ధరణి' పోర్టల్‌ను అమలులోకి తీసుకొచ్చింది. కానీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దాని పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు' అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్ వివరించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ రకాల భూ రికార్డుల సమస్యలకు పరిష్కారం చూపుతున్న ధరణి వ్యవస్థపై విమర్శలు చేయడం తగదని అన్నారు. ధరణి ద్వారా ఇప్పటివరకు 95 శాతం వరకు రెవెన్యూ రికార్డుల సమస్యలు పరిష్కారం అయ్యాయని, మిగతా రికార్డుల సమస్యలు త్వరలోనే కొలిక్కి వస్తాయని తెలిపారు. ఆచరణలో ఎదురవుతున్న పాత రికార్డుల సమస్యలు అక్కడక్కడ కొన్ని అధికారుల దష్టికి వస్తున్నాయని, కుటుంబ కలహాలు, భూముల సరిహద్దు వివాదాలు, పూర్వపు క్రయ విక్రయాల సమస్యలు, ట్రాన్స్ఫర్ ఆఫ్ మాడ్యుల్(టీఎం-33)లో కొన్ని అంశాలు మాత్రమే కలెక్టర్ల వద్ద పరిష్కారం కోసం ఉన్నాయని వివరించారు. వాటిని కూడా దశల వారీగా కొలిక్కి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. పూర్తిగా పారదర్శకతతో ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ధరణి సిస్టమ్‌ను తప్పు పట్టడం కిషన్రెడద్డికి తగదని, కచ్చితమైన సమస్యను చూపితే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కొన్ని సమస్యలను సాకుగా చూపి మొత్తం ధరణి వ్యవస్థను తప్పు పట్టడం సరికాదని అన్నారు. ఆ వ్యవస్థ అమల్లోకొచ్చిన నాటి నుంచి రెవెన్యూ రికార్డులన్నీ సాఫీగా సాగుతున్నాయని, భూముల క్రయ, విక్రయాల రికార్డులన్నీ వెంటనే నమోదు అవుతున్నాయని చెప్పారు. పాత రికార్డుల్లో మాత్రమే కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా దశల వారీగా అధికారులు పరిష్కరిస్తున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా అమలు జరుగుతున్న ధరణి వ్యవస్థను కేంద్ర వ్యవసాయ, ఐటీ మంత్రిత్వ శాఖల అధికారులు మెచ్చుకున్నారని తెలిపారు. ధరణీ తరహా వ్యవస్థను దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలంటూ కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులు సూచించిన విషయాన్ని వినోద్‌కుమార్ గుర్తు చేశారు.