Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాపంథా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మత విద్వేష, ఫాసిస్టు బీజేపీని ఓడించిన ప్రజల తీర్పును ఆహ్వానిస్తున్నామని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా ప్రకటిం చింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిరాయింపులకు అవకాశం ఇచ్చే వాతావరణం లేకుండా కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీతో బీజేపీని మట్టికరిపించడం ఓటర్ల విజ్ఞతకు నిదర్శనమని తెలిపారు. బీజేపీ గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించి దొడ్డిదారిలో దొంగ పద్ధతిలో అధికారానికి వచ్చిందని పేర్కొన్నారు. కర్నాటకలో ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టిందని తెలిపారు. గౌరీలంకేశ్, కల్బుర్గి వంటి మేధావులు, జర్నలిస్టులను చంపిందని విమర్శించారు. మోడీ, అమిత్షా దుష్ట రాజకీయాలకు ఫాసిస్టు విధానాలను వ్యతిరేకించారని పేర్కొన్నారు. ఈ తీర్పు ప్రజాస్వామికమైందని తెలిపారు. విద్వేషాలతో రగులుతున్న దేశానికి ఇది ఊరట అని వివరించారు. ఇది దేశ భవిష్యత్ తీర్పుగా మారాలని ఆకాంక్షించారు.