Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వం టెండర్లు పిలిచి, తర్వాత దాన్ని రద్దు చేయడానికి గల కారణాలు ఏమిటో చెప్పాలని తెలంగాణ హైకోర్టు కోరింది. మన ఊరు - మన బడి కార్యక్రమం కింద బల్లలు, బెంచీలు అందజేసేందుకు ఇచ్చిన టెండర్‌ను ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఇచ్చింది. ఈ టెండర్‌ను తాము దక్కించుకున్నామని చింతామణి పరస్వంత్ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. టెండర్ కోసం ప్రభుత్వానికి రూ.2.95 లక్షల నగదును బ్యాంక్ గ్యారెంటీగా ఇచ్చినట్టు తెలిపారు. ఎల్-1 కాంట్రాక్టర్‌గా తాము టెండర్ వేయగా, అదే నెలలో తమకు బిడ్ దక్కినట్లు ప్రభుత్వం చెప్పిందని వివరించారు. ఆ తర్వాత టెండర్‌ను ప్రభుత్వం రద్దు చేసి బెంచీలు, బల్లలు సప్లరు చేయాలని రాష్ట్ర జైళ్ల శాఖను ఆదేశించిందనీ, ఇది అన్యాయమనీ, స్టే ఇవ్వాలని పిటిషనర్ సంస్థ కోరింది.