Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సీపీఎస్ ఉద్యోగులకు సామాజిక భద్రత : ఎన్ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల్లో పాత పెన్షన్ అమలు చేస్తామంటూ ప్రధానంగా ప్రకటిం చిన కాంగ్రెస్ పార్టీ గెలవడం పట్ల ఎన్ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ, తెలంగాణ సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్ హర్షం ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగుల ఐదు లక్షల కుటుం బాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఓపీఎస్‌ను అమలు చేయడం ద్వారా సామాజిక భద్రత చేకూరుతుందని శనివారం వారు ఒక ప్రకటకలో తెలిపారు. పాత పెన్షన్ అమలు చేస్తామంటూ మ్యానిఫెస్టోలో ప్రకట ించిన పార్టీ గెలవడమనేది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల్లో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్)పై ఉన్న వ్యతిరేకత మరోసారి నిరూపిత మైందని పేర్కొన్నారు. నాడు ఓట్ ఫర్ ఓపీఎస్ ద్వారా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు పాత పెన్షన్‌ను పునరుద్ధరణ చేశాయని గుర్తు చేశారు. ఆ రాష్ట్రాల జాబితాలో కర్ణాటక రాష్ట్రం కూడా చేరనుందని తెలి పారు. ఈ సందర్భంగా కర్నాటక సీపీఎస్ ఉద్యోగు లకు శుభాకాంక్షలు ప్రకటించారు. ఓపీఎస్ పునరు ద్ధరణ చేయకపోతే ఏ ప్రభుత్వమైనా ఇంటిదారి పట్టా ల్సిందేనని వారు పునరుద్ఘాటించారు. డిసెంబర్లో బెంగళూరు కేంద్రంగా చేపట్టిన ఓట్ ఫర్ ఓపీఎస్ ఉద్యమం నేడు దాని ప్రతిఫలాలను అందుకోబోతు న్నదని వివరించారు. అక్కడ ఐదు లక్షల సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు వారి కుటుంబాల ఓట్లు దాదాపు 35 లక్షల వరకు ఉన్నాయని తెలిపారు. దీంతో రాష్ట్ర ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి వచ్చే పెన్షన్ నిధితో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సుపరి పాలన అందించొచ్చని సూచించారు. సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్లు దాదాపు 48 స్థానాల కు పైగా ప్రభావితం చేసిందని తెలిపారు. సీపీయస్ రద్దుతో కర్నాటక ప్రభుత్వానికి, ఉద్యోగుల పెన్షన్ కార్పస్ ఫండ్ రూ.24 వేల కోట్లు అందుతాయని వివరించారు. తెలంగాణలో కూడా పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు.