Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతకాల సేకరణ కార్యక్రమంలో మహిళా సంఘాల నేతల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలని పిలుపులో భాగంగా మహిళా సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి చౌరస్తాలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా), ఎన్ఎఫ్ఐడబ్ల్యు, పీఓడబ్ల్యూ సంధ్య, పీఓడబ్ల్యూ ఝాన్సీ, పీఓడబ్ల్యూ స్వరూప ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి ఎన్ జ్యోతితోపాటు ఇతర మహిళా సంఘాల నేతలు మాట్లాడుతూ రెజ్లర్ల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. వారి పోరాటానికి మద్దతుగా 40మంది రచయితలు,40మంది విద్యార్థులు,30 మేధావులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అంతర్జాతీయంగా రెజ్జర్ల పోటీల్లో దేశానికి పథకాలు తీసుకొచ్చిన మహిళా క్రీడాకారుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటం సిగ్గు చేటని విమర్శించారు. బాధితులు రోడ్డెక్కి న్యాయం కావాలని ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటమేంటని ప్రశ్నించారు.పైగా ఆందోళన చేస్తున్న మహిళా క్రీడాకారులను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాపై కూడా దాడులు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్, అరుణ జ్యోతి, ఉపాధ్యాక్షులు కె.ఎన్ ఆశలత, పీఓడబ్ల్యూ అనసూర్య, భారతి, సరళ, అనురాధ ఐద్వా నాయకురాలు కవిత తదితరులు పాల్గొన్నారు.