Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వే శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న రైళ్లకు ఇక్కడ కూడా స్టాప్‌లు ఇవ్వాలని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారంనాడాయన కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాసారు. యశ్వంత్‌పూర్ - హజ్రత్ నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు (నెం. 12649/12650) కాచిగూడ నుంచి బయలుదేరి కర్నూలు చేరుకునే వరకు 200 కిలోమీటర్ల మధ్యలో ఎక్కడా స్టాప్ లేని విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. ఆ రైలును మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్లో స్టాప్ ఏర్పాటుచేయాలని కోరారు. తద్వారా ఢిల్లీ, బెంగుళూరు వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం ఉండదని వివరించారు. అలాగే చెంగల్ పట్టు - కాచీగూడ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 17651/17652) కు షాద్‌నగర్ రైల్వేస్టేషన్లో స్టాప్ ఏర్పాటుచేయాలని కోరారు. దీనివల్ల హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాలైన తిమ్మాపూర్, కొత్తూరు, బూర్గుల వంటి తదితర ప్రాంతాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు.