ప్రపంచంలోని అతి శీతల ప్రదేశం అంటార్కిటికా... శీతలం వల్ల ఏర్పడిన మంచు పర్వతాలలో ఒక బ్లడ్ ఫాల్స్ ఉంది. ఇది తూర్పు అంటార్కిటికా ప్రాంతంలో విక్టోరియా ల్యాండ్‌లోని మెక్ముర్డో డ్రై లోయలోని టేలర్ వ్యాలీలో వెస్ట్‌లేక్ బోనీ ఉపరితలంపై ఉన్న టేలర్ హిమానీనదం నుండి ప్రవహిస్తుంది. దీనిని మొట్టమొదట 1911లో ఆస్ట్రేలియన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త గ్రిఫిత్ టేలర్ కనుగొన్నాడు. మొదట్లో దీని మీద చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ అలస్కా ఫెయిర్‌బ్యాంక్స్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనల్లో కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయి. ఇలా ఎరుపు రంగు జలపాతం ప్రవహించడానికి కారణం... ఉప్పునీటిలోని ఆక్సిడైజ్డ్ ఇనుము కారణంగా ఏర్పడుతుందట. ఉప్పు నీటిని కలిగి ఉన్న ఇనుము ఆక్సిజన్‌తో ఆక్సీకరణం చెందడం వల్ల ఎరుపు రంగులోకి మారుతుంది. అలా మారిన నీరే ఈ బ్లడ్ ఫాల్స్ రూపంలో బహిర్గతమై ప్రవహిస్తున్నట్లు వారు కనుగొన్నారు.