అతను ప్రపంచ ప్రసిద్ధ నాయకులలో ఒకరు... తన జాతి వివక్ష వ్యతిరేఖ ఉద్యమ కారుడు.. జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు సంకేతంగా నిలిచాడు. అందుకు 27 ఏండ్లు జైలు జీవితం అనుభవించాడు.. విడుదలైన తర్వాత తన లక్ష్య సాధన కోసం రాజకీయాలను మార్గంగా చేసుకున్నారు. దక్షిణాఫ్రికా దేశాధ్యక్ష పీఠాన్నెక్కాడు.. పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. ప్రపంచ సయోధ్యకు కృషి చేశాడు.. అందుకు ప్రతిగా అనేక అవార్డులు, సత్కారాలు అందుకోవడంతో పాటు నోబెల్ శాంతి బహుమతి సైతం వరించింది. నల్లజాతి సూరీడని ఆయనను వర్ణిస్తారు. ఆయనే నెల్సన్ మండేలా... జులై 18న జయంతి సందర్భంగా ఆయన యాదిలో...