భారతదేశంలోనే అరుదైన జాతరలలో ఒకటైన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర రెండేండ్లకొకసారి జరిగే గిరిజనోత్సవంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుత ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే 'సమ్మక్క- సారలమ్మ' జాతరకు ఎంతో విశిష్టత ఉంది. ఆదివాసీల శౌర్యానికి, సంప్రదాయాలకు కట్టుబాట్లకు నిదర్శనంగా మారింది ఈ పండుగ. గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా సమ్మక్క సారలమ్మలు చరిత్రలో నిలిచిపోయారు.ఆ ఆచారం విశ్వవ్యాప్తమై నేడు గిరిజనులే కాక గిరిజనేతరులు ఇతర రాష్ట్రాల వారు తరలివచ్చి మొక్కుబడులను చెల్లించుకుంటున్నారు. ఇలా భిన్న సంస్కృతుల కూడలిగా మారిన మేడారం చిత్రాలివి.. - అరవింద్ ఆర్య, 70972 70270