చరాచర సృష్టిలో వింతైన జీవులు ఎన్నో ఉన్నాయి. తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఒక జీవిని మరో జీవి వేటాడటం సహజం. అలాంటి కోవలోదే నల్లపాముల గద్ద (Crested Serpent-eagle). ఆసిపిట్రిఫార్మెస్ క్రమానికి చెందిన పక్షి. ఇది తరచుగా అడవిలో చెట్ల పైన ఎగురుతూ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా పాములను, బల్లులను ఆహారంగా తీసుకుంటుంది. కొన్నిసార్లు కప్పలను లేదా పక్షులను కూడా ఆహారంగా తీసుకుంటుంది. అలా ఒక పాముని (నీరు కట్టు) పట్టుకుని తీసుకువెళ్లే క్రమంలో తీసిన చిత్రాలే ఇవి....!!