1765 నుంచి 1796 మధ్య మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ ప్రాంతాన్ని పరిపాలించిన హోల్కార్ రాణి అహిల్యబాయి కోటను నిర్మించారు. ఆమె పేరు మీదనే ఈ కోటను అహిల్య కోటగా పిలుస్తారు. ఇందులో తన పరివారానికి నివాసాలు, కార్యాలయాలు, దర్బారు, ఆడిటోరియం వంటి సకల సదుపాయాలను ఇందులో ఉండేలా ఏర్పాటు చేయించారు.