Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు వచ్చారు. బెయిల్ పై ఉన్న గంగిరెడ్డిని ఈ నెల 5వ తేదీ లోపల లొంగిపోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో లొంగిపోయేందుకు ఆయన సీబీఐ కోర్టుకు వచ్చారు. కాసేపట్లో ఆయన లొంగిపోనున్నారు. వివేకా హత్య కేసులో గంగిరెడ్డిని 2019 మార్చి 28న అరెస్ట్ చేశారు. అయితే 90 రోజులు గడిచినా ఆయనపై ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో అదే ఏడాది 27న ఆయనకు డీఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు... మే 5లోగా సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది.