Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మాడ్రిడ్
మాడ్రిడ్: మాడ్రిడ్ ఓపెన్ మెన్స్ డబుల్స్ ఫైనల్లోకి రోహన్ బొప్పన్న జోడి ఎంటరైంది. ఈ టోర్నీలో ఇండియన్ టెన్నిస్ స్టార్ బొపన్న.. ఆస్ట్రేలియా ప్లేయర్ మాథ్యూ ఎబ్డెన్తో జతకట్టాడు. సెమీస్‌లో బొప్పన్న-మాథ్యూ జోడి.. సాంటియాగో గొంజాలెజ్-ఎడార్డ్ రోజర్ వాసిలిన్ జంటపై గెలుపొందారు. 43 ఏళ్ల బొప్పన్న.. 35 ఏళ్ల ఎబ్డెన్తో కలిసి ఎనిమిదో సీడ్ జంట గొంజాలెజ్-రోజర్ జోడిని 5-7, 7-6, 10-4 స్కోర్‌తో ఓడించారు. ఏడో సీడ్‌గా ఇండో-ఆస్ట్రేలియన్ జోడి ఈ టోర్నీలో ఎంటరైంది. శనివారం జరిగే ఫైనల్లో బొప్పన్న జోడి.. రష్యాకు చెందిన అన్‌సీడెడ్ జంట కరేన్ కచనోవ్, ఆండ్రే రూబ్లెవ్తో తలపడనున్నది. ఆ జంట తమ సెమీస్‌లో ఫ్రెంచ్ ఓపెన్ విజేతలు మార్సెల్లో అరెవలోవ్, జీన్ జులియన్ రోజర్పై విజయం సాధించారు.