Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - డెహ్రాడూన్
కేదార్నాథ్ యాత్ర కోసం భక్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. వాతావరణం సరిగా లేని కారణంగా.. ఈ నెల 8వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు బంద్ చేసినట్లు చెప్పారు. కేదారీఘాటీలో రానున్న నాలుగు రోజులు వర్షాలు ఉన్నట్లు తెలుస్తోంది. వెదర్ చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు బంద్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టూరిజం శాఖ ప్రకారం ఇప్పటికే 1.26 లక్షల మంది యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మే 4వ తేదీ వరకు దాదాపు 1.23 లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నట్లు తెలుస్తోంది. గురువారం కేదార్నాథ్ రూట్లో ఉన్న బైరాన్ గ్లేసియర్ కూలడంతో.. ఆ రూటును క్లోజ్ చేశారు. డీడీఎం, ఎడీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, వైఎంఎఫ్ దళాలు మంచు ముక్కల్ని తొలగించారు. గుర్రాలు, గాడిదలు వెళ్లే రూటును కూడా ఇంకా తెరువలేదు. చాలా వేగవంతంగా నడక రూట్లో స్నోను తొలగిస్తున్నారు. భైరవ్, కుబేర్ ఘాట్ రూట్లో గ్లేసియర్ కూలడంతో ఆ రూట్‌ను మూసివేశారు.