Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాజమండ్రి
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ కు టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుమతి లభించింది. జైల్లో ఉన్న టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను ఆయన పరామర్శించనున్నారు. ఆయనతో పాటు వెళ్లడానికి పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలకు అధికారులు అనుమతిని ఇచ్చారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు చంద్రాబు సెంట్రల్ జైలు వద్దకు రానున్నారు. జైలు వద్దకు చంద్రబాబు రానుండటంతో అక్కడకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకునే అవకాశం ఉంది.