Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగి రెడ్డి కోర్టులో లొంగిపోయాడు. ఎర్ర గంగిరెడ్డికి జూన్ 2వ తేదీ వరకూ నాంపల్లి సీబీఐ కోర్టు రిమాండ్ విధించింది. ఎర్ర గంగి రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. వివేకాను హత్య చేస్తే నాలుగు కోట్లు ఇస్తామని దస్తగిరికి ఎర్ర గంగి రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. నాలుగు కోట్ల రూపాయల వ్యవహారం వెనుక భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ చేయనుంది. ఎర్ర గంగి రెడ్డి బెయిల్ పై బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో హైకోర్టు బెయిల్ రద్దు చేసింది. మరి కొద్ది సేపటిలో చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. ఎర్ర గంగి రెడ్డిని 72 సార్లు సీబీఐ విచారించింది.