Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మ్యాన్ హోల్ లో పడిన బాలుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలోని ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వాసవి వెంచర్ మ్యాన్ హోల్ లో బాలుడి మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితం వర్షంలో బాలుడు బయటకు వెళ్లాడు. అయితే ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదమా ? లేక హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.