#MadhyaPradesh के मुरैना में जमीन के लिए महाभारत, ताबड़तोड़ फायरिंग में एक ही परिवार की 3 महिलाओं समेत 6 सदस्यों की हत्या#MadhyaPradesh #Crime Morena #MPNews pic.twitter.com/dYyobs8Dk2
— India TV (@indiatvnews) May 5, 2023
Authorization

నవతెలంగాణ-హైదరాబాద్ : మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. మొరెనా జిల్లాలోని లేపాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. ఈ కాల్పుల్లో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. భూవివాదం, పాత కక్షలతోనే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను మొరెనా జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కాల్పుల్లో మొత్తం 8 మంది పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.