Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడు రాష్ట్రం తిరువన్నమలై సమీపంలో కన్న మంగళం వద్ద మినీ వ్యాన్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. మినీ వ్యాన్ డ్రైవర్ సహా అందులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వేలూరు ఆస్పత్రికి తరలించారు. తిరువన్నామలైలో గిరిప్రదక్షిణ పూర్తి చేసుకుని ఉదయం తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చి ఢీకొనడంతో వాహనాల ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జాయి. కారు ముందు సీట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా వెనుక సీట్లో ఉన్న ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.