Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, యువ న్యాయవాది ఎం.విప్లవకుమార్ వ్యాసం సంకలనం 'హార్ట్ బీట్' ను ప్రముఖ తత్వవేత్త కంచ ఐలయ్య ఆవిష్కరించారు. మోదుగుపూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పుస్తకావిష్కరణ సభలో ఐలయ్య మాట్లాడారు. అరుణోదయ రాష్ట్ర నాయకురాలు విమలక్క, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లు లక్ష్మీ , కంబాల పల్లి కృష్ణ, చలికాని వెంకట్ యాదవ్, కొండూరి వీరయ్య, కలేకూరి రాజులు మాట్లాడారు. హార్ట్ బీట్ ను డివైఎఫ్ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎ. విజయ్ కుమార్, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థి ఇమ్మడి మహేందర్ పరిచయం చేశారు. ఈ సభలో చంద్రమోహన్, పాటలు వెంకన్న, బిరెడ్డి సాంబశివ, సలీమ, ఆర్ఎల్ మూర్తి , బి. మహేందర్ లు ఆత్మీయ సందేశాలిచ్చారు.
ఈ సభలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, ఏం. వెంకటేష్, సీపీఐ(ఎం) నాయకులు జి.రాములు, మల్లు నాగార్జున రెడ్డి, వేముల ఎల్లయ్య, అనంతోజు మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.