Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపిఎల్ 2023 16వ సీజన్ లో భాగంగా ఇవ్వాల రాత్రి రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయి కేవలం 118 పరుగులు చేయగలిగింది రాజస్థాన్ టీం. ఇక, హార్డిక్ కప్టెన్సీ వహిస్తున్న గుజరాత్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 120 బంతుల్లో 119 పరుగులు చేయాల్సి ఉంది. రాజస్థాన్ జట్టు తరుఫున వచ్చిన బాట్స్ మెన్స్ ఎవరు కూడా ఈ మ్యాచ్ లో పెద్దగా రాణించలేకపోయారు. దాదాపు క్రీస్ లోకి వచ్చిన వాళ్లందరూ కనీసం 15 పరుగులు కూడా దాటించకుండా పెవెలియన్ చేరుకున్నారు. ఇక గుజరాత్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా 1, జోష్ లిటిల్ 1, మహ్మద్ షమీ 1, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీసుకోగా.. అత్యధికంగా రషీద్ ఖాన్ 3 మూడు వికెట్లు సోంతం చేసుకున్నాడు.