Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివారులోని ఓ వెంచర్లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇక్కడి కాలనీలో బాగారెడ్డిపల్లికి చెందిన మహేశ్(32) అనే వ్యక్తి ఒక్కడే నివసిస్తున్నారు. ఆయన నివాసానికి దగ్గరలో ఓ ఇంటి నిర్మాణం జరుగుతోంది. దాని యజమాని తన ఇనుప రాడ్లు దొంగిలించావంటూ మహేశ్‌ను నిలదీశాడు. అనంతరం అతన్ని లాక్కెళ్లి స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక మహేశ్ మృతిచెందాడు. యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి వరకు మృతుడి వైపు నుంచి ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో వివరాలు తెలియరాలేదని, శనివారం తదుపరి విచారణ చేసి కేసు నమోదు చేస్తామని రూరల్ ఎస్సై పరమేశ్ పేర్కొన్నారు.