Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: ఇకపై రైలు ప్రయాణాల్లో తమతోపాటు పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు టీటీఈలు పెంపుడు జంతువులకు టికెట్ కేటాయించే అధికారాన్ని రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు పెంపుడు జంతువులు కలిగిన ప్రయాణికులు ఫస్ట్‌క్లాస్ ఏసీ బోగీలో ప్రయాణించేందుకు మాత్రమే అనుమతించేవారు. ఇందుకోసం ప్రయాణ తేదీ రోజున స్టేషన్‌లోని పార్సిల్ కౌంటర్‌కు వెళ్లి పెంపుడు జంతువుల కోసం టికెట్ బుక్ చేసుకోవాలి. అలానే, సెకండ్ క్లాస్ లగేజ్ లేదా బ్రేక్‌వ్యాన్‌లో ఒక బాక్స్‌లో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతించేవారు. ఈ వ్యవహారం మొత్తం ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉండటంతో రైల్వే మంత్రిత్వ శాఖ కొత్తగా పెంపుడు జంతువులకు ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో మార్పులు చేయాలని రైల్వేశాఖ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌కు సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నిబంధన ఏనుగులు, గుర్రాలు, కుక్కలు, పిల్లులు పక్షులు వంటి పెంపుడు జంతువులకు వర్తిస్తుందని సమాచారం.