Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: రుతుపవనాల సీజన్‌కు ముందు.. మార్చి 1 నుంచి ఈ నెల 3 వరకూ దేశంలో సాధారణం కన్నా 28 శాతం అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ముఖ్యంగా మధ్యభారత దేశంలో 268 శాతం ఎక్కువగా వర్షాలు పడ్డాయి. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం 29 శాతం లోటు కనిపించింది. దక్షిణాదితో కూడిన ద్వీపకల్ప భాగంలో 88 శాతం, మధ్య భారత దేశంలో 18.2 శాతం, పంజాబ్, హరియాణా, దిల్లీ, రాజస్థాన్ తదితర రాష్ట్రాలతో కూడిన వాయవ్య భారత దేశంలో 18 శాతం మేర అధికంగా వానలు కరిశాయని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ 21-22 నుంచి చాలాచోట్ల వర్షాలు ఎక్కువగా పడ్డాయని వివరించింది. దీనివల్ల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయని పేర్కొంది. గత నెల 21 నుంచి దేశంలో ఎక్కడా వడగాల్పులు తలెత్తలేదని తెలిపింది.