Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ప్రధాన నిందితుడు నైజీరియన్తో పాటు ఐదుగురిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి నైజీరియన్‌కు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయల కొకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠా విదేశాల నుంచి కొకైన్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరికాసేపట్లో ఇదే అంశంపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నారు.