Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పల్నాడు: పురినొప్పులతో బాధపడుతున్న మహిళలకు సుఖ ప్రసవం చేయడంతో పాటు పుట్టిన పసిపాప ప్రాణాలను కూడా రక్షించారు 108 సిబ్బంది. జిల్లాలోని బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంకు చెందిన త్రివేణికి పురుటినెప్పులు మొదలయ్యాయి. కాన్పు కోసం మహిళను కుటుంబసభ్యులు సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు 108లో తరలించారు. అయితే మార్గమధ్యలో ధూళిపాళ్ళ వద్ద మహిళకు తీవ్రమైన పురిటినొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి వెళ్లేలోపలే మహిళకు ప్రసవం అయిపోతుందని భావించిన ఈఎంటీ గోపి మహిళకు ప్రసవం చేసేందుకు సిద్ధమయ్యారు. వెంటనే మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డకు ఆక్సిజన్ అందకపోవడంతో కాసేపు ఆందోళన చెందారు. అయితే ఈఎంటీ గోపి సకాలంలో స్పందించి పసిపాపకు సీపీఆర్ చేయడంతో ప్రాణాలు నిలిచాయి. అనంతరం తల్లీ, బిడ్డను సత్తెనపల్లి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అయితే సకాలంలో సీపీఆర్ చేసి పసిబిడ్డ ప్రాణాలు నిలిపిన ఈఎంటీ గోపీని అందరూ అభినందిస్తున్నారు.