Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్ 2023 సీజన్లోనూ గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచుల్లో ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా గతేడాది ఫైనల్లో ఢీకొట్టిన రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. జయపుర వేదికగా జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 119 పరుగుల టార్గెట్‌ను 13.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి ఛేదించింది. హార్దిక్ పాండ్య (39*: 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు. గత మ్యాచ్‌లో ఢిల్లీపైనా చివరి వరకూ క్రీజ్‌లో ఉన్నప్పటికీ గుజరాత్‌ను గెలిపించడంలో మాత్రం విఫలమయ్యాడు. ఇదే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్ధశతకం సాధించినా స్ట్రైక్‌రేట్ మాత్రం దారుణంగా ఉండటంతో విమర్శలు వచ్చాయి. రాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం జీటీ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇదే విషయంపై స్పందించాడు.
‘‘గత మ్యాచ్‌లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో పొరపాట్లు జరిగాయి. ఈసారి (రాజస్థాన్‌పై) మాత్రం నేనొచ్చేసరికే సగం టార్గెట్‌ను ఓపెనర్లు కొట్టేశారు. తప్పులను అంగీకరించడానికి నేనేం సిగ్గుపడను. ఇలా ఉండటమే నా సక్సెస్‌కు కారణం. ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు అదరగొట్టారు. మరీ ముఖ్యంగా రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ప్రత్యర్థులను కట్టడి చేశారు. నూర్‌తో అద్భుతంగా బౌలింగ్ వేయించిన ఘనత రషీద్‌దే. నూర్‌తో అతడి కంటే మరెవరూ అత్యుత్తమంగా కమ్యూనికేట్ చేయలేరు. నేను కేవలం సూచనలు మాత్రమే చేశా. ఎలాంటి సమయంలో ఏ విధంగా బౌలింగ్ చేయాలనే దానిపై వారికి పూర్తి అవగాహన ఉంది. పరిస్థితులు అదుపు తప్పినప్పుడు మాత్రమే నేను వారితో సంభాషిస్తా. వీరిద్దరి బౌలింగ్‌లో కీపింగ్ చేయడం కూడా కష్టమే. అయితే, వృద్ధిమాన్ సాహా అద్భుతమైన కీపర్. రషీద్, నూర్ బౌలింగ్‌ను అంచనా వేసి సూపర్‌గా స్పందించాడు’’ అని పాండ్య తెలిపాడు.