Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబ్‌నగర్: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి గల్లా అరుణ, గల్లా జయదేవ్‌తో కలిసి భూమిపూజలో పాల్గొన్నారు. అనంతరం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, బ్యాటరీ కంపెనీ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రంలోని పలు జంక్షన్లను ప్రారంభిస్తారు. అనంతరం బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ముగిసిన వెంటనే మినీ ట్యాంక్‌బండ్ వద్ద నిర్మించనున్న ఐల్యాండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసి శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో జంగల్ సఫారీని ప్రారంభించనున్నారు. అటునుంచి హైదరాబాద్‌కు పయణమవుతారు.