Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎయిర్ ఇండియా విమానం నింగిలో ఎగురుతున్న సమయంలో ఒక ప్రయాణికురాలిని తేలు కుట్టింది. ఈ ఘటన ఏప్రిల్ 23న జరిగినప్పటికీ... ఆలస్యంగా ఇప్పుడు వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, నాగపూర్ నుంచి ముంబైకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికురాలికి చికిత్స అందించారు. చికిత్స తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఏఐ 630లో ఈ ఘటన జరిగిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విమానంలో సోదాలు చేసినట్టు చెప్పారు. బాధితురాలికి జరిగిన అసౌకర్యం పట్ల క్షమాపణ చెపుతున్నామని తెలిపారు.