Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలో తాజాగా 50 మంది డీఎస్పీలను బదిలీలు, పోస్టింగులు చేస్తూ డీజీపీ కె.వీ.రవీంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అమలాపురం ఎస్డీపీవోగా అంబికా ప్రసాద్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం... ఏసీబీ డీఎస్పీగా.. టీఎస్ ఆర్ కె . ప్రసాద్‌ను రామచంద్రాపురం ఎస్డీపీవోగా బదిలీ చేశారు. ప్రకాశం జిల్లా డీఎస్పీ కిషోర్ కుమార్‌ను రాజమహేంద్రవారం తూర్పు డీఎస్పీ విజయవాడ పశ్చిమ ఏసీపీగా హనుమంతరావును ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జమ్మలమడుగు ఎస్డీపీవోగా. ఉమామహేశ్వరరెడ్డిని గుంటూరు డీఎస్పీగా ఒంగోలు డీఎస్పీగా నారాయణస్వామి రెడ్డి, దర్శి డీఎస్పీగా అశోక్ వర్ధన్, కనిగిరి డీఎస్పీగా రామరాజు నియమించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కోరుకున్న హరినాథ్‌రెడ్డిని అనంతపురం పీటీసీకి బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న 24మంది డీఎస్పీలను వేర్వేరు చోట్ల పోస్టింగ్ ఇస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.