Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ఓ యువకుడు మరో యువకుడిపై యాసిడ్ తో దాడి చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ లో చోటు చేసుకుంది. విజయ డైరీలో పనిచేస్తున్న అజయ్, దత్తు స్నేహితులు. వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. యువకులిద్ధరూ ఒకరిపై ఒకరు మాటలు రువ్వకున్నారు. అంతటితో ఆగకుండా కొట్టుకున్నారు. ఈ క్రమంలో గొడవ ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అజయ్ ..దత్తుపై యాసిడ్ తో దాడి చేశాడు. దీంతో అజయ్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అజయ్ ని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.