Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా.. అత్యధిక కప్పులు ఎగరేసుకుపోయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆసక్తికర సమరం సాగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభకానుంది. కాగా కొద్దిసేపటి క్రితం టాస్ వేయగా చెన్నై సూపర్ కింగ్ టాస్ గెలిచింది. దీంతో కెఫ్టెన్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. లీగ్ దశలో రెండు జట్ల మధ్య ఇది రెండో పోరు. మార్చి 12న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, చెన్నై జట్టు 18.1 ఓవర్లకే దానిని సాధించింది. దీంతో నేటి పోరులో ముంబై ఇండియన్స్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది.