Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీశైలం: భద్రాద్రి కొత్తగూడెం సండ్రుగుండ ప్రాంతం నుంచి శ్రీశైలానికి 20 మంది భక్తులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు నల్లమల ఘాట్ రోడ్డులో శనివారం బోల్తా పడింది. సమాచారం మేరకు బస్సు శ్రీశైలం దర్శనానికి వెళ్తుండగా ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 10 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా, మరికొందరికి చేతులు, కాళ్లు విరిగిపోయినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం శ్రీశైలం, సున్నిపెంట ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.