Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపిఎల్ 2023 16వ సీజన్ లో భాగంగా ఇవ్వాల రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 50వ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు ఫాఫ్ డు ప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, మరి కొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో రెండు జట్లు 9 మ్యాచ్ లు ఆడగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 3 మ్యాచ్ లు గెలిచి ఆరు ఓడిపోయింది.. రాయల్ ఛాలెంజర్స్ జట్టు 5 మ్యాచ్ లు గెలిచి నాలుగు మ్యాచ్ లు ఓడిపోయింది.. దీంతో పాయింట్స్ టేబుల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఐదో స్థానంలో సెటిల్ అవ్వగా.. ఢిల్లీ జట్టు పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానంలో ఉంది.