Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ప్రభుత్వం కొత్తగా 40 పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా దోమలగూడ, సెక్రటేరియట్, ఖైరతాబాద్, వారసిగూడ, బండ్లగూడ, ఐఎస్ సదన్, గుడి మల్కాపూర్, ఫిలింనగర్, మధురానగర్, మాసబ్ ట్యాంక్, బోరబండ, మోకిల్లా, అల్లాపూర్, సూరారం, కొల్లూర్, జినోమ్‌వ్యాలీ పోలీస్స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేస్తున్నది. అలాగే కొత్తగా 11 లా అండ్ ఆర్డర్, 13 ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు, రెండు టాస్క్‌ఫోర్స్ జోన్లు ఏర్పాటు చేసింది. కొత్తగా మేడ్చల్, రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ జోన్లుగా నిర్ణయించింది. దాంతో పాటు కొత్తగా ఆరు డీసీపీ జోన్లు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో 12 డివిజన్లు, సైబరాబాద్‌లో మూడు డీసీపీ జోన్లను, ప్రతి జోన్‌కు ఒక మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ప్రతి ఏరియాలోనే సైబర్‌క్రైమ్, నార్కోటింగ్ వింగ్‌ను సైతం ఏర్పాటు చేసింది.