Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నూతన సచివాలయంలో చేదు అనుభవం ఎదురైంది. రాజాసింగ్‌ను సచివాలయంలోకి రాకుండా శనివారం గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామాలపై రాజాసింగ్ సీరియస్‌గా స్పందించారు. సమావేశం ఏర్పాటు చేశామని.. నగరంలోని ఎమ్మెల్యేలు, ఎంపిలందరినీ రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన సచివాలయానికి వద్దకు బుల్లెట్ బైక్‌పై వచ్చారు. ఆయనను భద్రతా సిబ్బంది అడ్డగించారు. సచివాలయం లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. దీంతో రాజాసింగ్ చాలా సేపు గేటు బయటే వేచివున్నారు. అయినా ఫలితం లేకపోవటంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.పోలీసులు తనను అడ్డుకోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను సమావేశానికి పిలిస్తే పోలీసులు అడ్డుకుని అవమానకరంగా ప్రవర్తించారని రాజాసింగ్ అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన సచివాలయంలోకి ప్రజాప్రతినిధులను రానివ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకోవాలని అసలు ఎవరు చెప్పారో పోలీసులు వివరించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.