Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సూర్యాపేటలో ఓ ఇంటి యజమాని గొడ్డలితో మున్సిపల్ సిబ్బందిపై దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 3లో అక్రమంగా ఇంటిని నిర్మించారని చెబుతూ, సదరు నిర్మాణాన్ని మున్సిపల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన యజమాని బిక్షం నాయక్ అనే మున్సిపల్ ఉద్యోగిపై గొడ్డలితో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.