Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఓ కార్యక్రమంలో రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయినప్పటికీ ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించి ముగించారు. ఒడిశాలో జరిగిందీ ఘటన. మూర్భంజ్ జిల్లా బరిపదలోని మహారాజ శ్రీరామచంద్ర భంజదేవ్ వర్సిటీలో నిన్న స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ కాన్వొకేషన్లో పాల్గొన్న రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో సరిగ్గా ఉదయం 11.56 గంటల నుంచి దాదాపు 9 నిమిషాలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో యూనివర్సిటీ ఆడిటోరియంలో చీకట్లు అలముకున్నాయి. అయినప్పటికీ తన ప్రసంగాన్ని ద్రౌపది ఆపలేదు. పోడియం నుంచి వస్తున్న వెలుతురు మధ్య తన ప్రసంగాన్ని కొనసాగించారు. చీకటి, వెలుగులను సమానంగా చూడాలనే విషయాన్ని ఈ ఘటన నుంచి మనం నేర్చుకోవాలని పేర్కొంటూ తన ప్రసంగాన్ని కొనసాగించి పూర్తి చేశారు.