Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కటక్: త్వరలో ఇద్దరు కలెక్టర్లు పెళ్లి బంధంతో ఒక్కటవబోతున్నారు. పూరీ కలెక్టర్ సమర్థవర్మ, రాయగడ కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్ ఈ నెల 15వ తేదీన వారణాసిలోని స్వాధాదేవ్ సింగ్ ఇంటి వద్ద పెళ్లి చేసుకోనున్నారు. ఈ పెళ్లికి పూరీకి చెందిన కొంతమంది సేవాయత్లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. స్వాధాదేవ్ సింగ్ కొంతకాలం క్రితం బొలంగీర్ కలెక్టర్ చంచల రాణాను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. పూరీ కలెక్టర్ సమర్థవర్మ కూడా ఇటీవల రైల్వే అధికారిణి సుచిసింగ్ను పెళ్లి చేసుకున్నారు. వీరు కూడా విడిపోయారు.