Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే బిఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఆయన ఖమ్మం జిల్లాలో సొంతంగా రాజకీయం నడిపిస్తున్నారు. తనకు లాగే బిఆర్ఎస్ లో ప్రాధాన్యత దక్కని వారిని ఏకం చేసి..జిల్లాపై పట్టు సాధించే దిశగా వెళుతున్నారు. అయితే, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మే 15 నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురం నుంచి కల్లూరు, ఇల్లెందు, అశ్వాపురం మండలాల్లో యాత్ర చేయనున్నారు. మే14న ఖమ్మంలో అభిమానులతో సమావేశం కానున్నారు. కాగా, రెండు రోజుల క్రితం బిజెపి ముఖ్య నేతలు పొంగులేటిని కలిశారు. కానీ ఆయన పార్టీలో చేరే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.