Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిరిసిల్ల: జమ్ము, కశ్మీర్లో హెలికాప్టర్ కూలిన దుర్ఘటనలో మృతి చెందిన అమరజవాన్ పబ్బాల అనిల్(30)కు శనివారం ఆయన స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్, ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులు అర్పించారు. జమ్ము, కశ్మీర్లో గురువారం హెలికాప్టర్ కూలిన ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్(30) మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని శనివారం తెల్లవారుజామున మల్లాపూర్‌కు తీసుకొచ్చారు. అనిల్ కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. యువకులు జోహార్లు తెలుపుతూ జాతీయ పతాకాలతో అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అనిల్ భార్య సౌజన్య, ఇద్దరు పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది.