Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు: ఐపీఎల్లో బెంగళూరు-లఖ్‌నవూ మ్యాచ్ సందర్భంగా కోహ్లి-గంభీర్, కోహ్లి-నవీనుల్ గొడవ ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఈ గొడవ కారణంగా కోహ్లి, గంభీర్‌లకు వంద శాతం, నవీనుల్‌కు 50 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించాడు మ్యాచ్ రిఫరీ. కోహ్లి తరఫున ఆర్సీబీ యాజమాన్యం రూ.1.07 కోట్లు జరిమానాగా చెల్లించింది. అయితే తనకు అంత కఠిన శిక్ష విధించడం పట్ల కోహ్లి అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీసీసీఐ అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. తాను ఉద్దేశపూర్వంగా ఎవరితోనూ గొడవ పడలేదని.. ముందు నవీనుల్, తర్వాత గంభీర్ తనతో గొడవ పెట్టుకున్నారని.. వంద శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించేంత తప్పు తాను చేయలేదని విరాట్ ఈ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.