Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా భార్య వెళ్తున్న కారును అడ్డగించి, వేధింపులకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను శనివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 8:30 గంటల సమయంలో డ్రైవర్‌తో కలిసి నితీశ్ భార్య కారులో ఇంటికి బయల్దేరింది. కీర్తి నగర్ ప్రాంతంలో రెడ్ సిగ్నల్ పడడంతో కారు ఆగింది. ఆ సమయంలో అధిక వేగంతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారుకు అడ్డంగా తమ ద్విచక్ర వాహనాన్ని నిలిపారు. అనంతరం ఆమె వైపు చూస్తూ.. కారుపై చేతులతో బాదారు. ఈ ఘటనపై శుక్రవారం ఈ- మెయిల్ ద్వారా కీర్తి నగర్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన పోలీసులు చైతన్య శివమ్ (18), వివేక్ (18)ను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.