Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కాకినాడ: కాకినాడ జిల్లా గాంధీనగర్ మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని ముప్పల హేమశ్రీ పదో తరగతి పరీక్షల్లో సత్తాచాటింది. ఈ చిన్నారి అసమాన ప్రతిభను ఇక్కడి ఉపాధ్యాయులు కొన్నాళ్ల కిందట ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మార్చి 27న విజయవాడ సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ హేమశ్రీ తెలివితేటల్ని పరీక్షించారు. ఆమె ప్రతిభకు మెచ్చి గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు రాసేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. శనివారం ప్రకటించిన ఫలితాల్లో ఆమె 488 మార్కులు సాధించింది. తల్లి మణి గృహిణి, తండ్రి సురేష్ ప్రైవేటు ఉద్యోగి.