Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ఖమ్మం: ఖమ్మం జిల్లాలో స్థానికంగా పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న రాయల సతీష్ బాబుకు ఎప్పట్నించో మెడిసిన్ చదవాలనే కోరిక. కానీ, బాధ్యతలు, ఉద్యోగం, కోచింగ్ సెంటర్ నిర్వహణ వంటివి అనేక కారణాలు.
కుమార్తె ఇంటర్మీడియట్ పూర్తయి.. నీట్ పరీక్ష రాస్తోంది. వాస్తవానికి మొన్నటి వరకూ నీట్ పరీక్షకు వయో పరిమితి ఉండేది. గత ఏడాది నుంచి వయో పరిమితి తొలగించడంతో మెడిసిన్ చదవాలనే కోర్కెను నెరవేర్చుకునేందుకు సిద్ధమయ్యాడు ఆ తండ్రి. రాయల సతీష్ బాబు 49 ఏళ్ల వయస్సులో నీట్ పరీక్షకు సంసిద్ధుడయ్యాడు. అటు కూతురు కూడా ఇవాళ నీట్ పరీక్ష రాయనుంది. మొత్తానికి తండ్రీ కూతుళ్లు కలిసి నేడు పరీక్ష రాయబోతున్నారు.
వాస్తవానికి బీటెక్ పూర్తిచేసిన సతీష్ బాబుకు మెడిసిన్ చదవాలనే కోరిక ఉండిపోయింది. ఇంటర్మీడియట్ ఎంపీసీ కావడంతో నీట్ పరీక్ష రాయాలంటే బయోలజీ, జువాలజీ నేపధ్యం ఉండాలి. దీనికోసం తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్ట్ నుంచి ప్రత్యేక అనుమతితో ఇంటర్మీడియట్ జువాలజీ, బోటనీ రెండు సంవత్సరాల పరీక్షలు రాసేసాడు. ఆ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నాడు. ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆసుపత్రి కట్టాలనేది ఆ తండ్రి ఆలోచన. నిజాయితీగా నాణ్యమైన ఆరోగ్య సేవల్ని అందించాలనేది అతని సంకల్పం. ఒకవేళ తన ఈ ప్రయత్నం విఫలమైనా ఎందరికో ఆదర్శం కాగలదంటున్నాడు ఆ తండ్రి. తండ్రితో కలిసి నీట్ పరీక్ష రాయడం సంతోషంగా ఉందంటోంది ఆ కూతురు.