Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలోకి దూసుకొచ్చింది. చెపాక్ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ముంబయిని కట్టడి చేయడంలో చెన్నై పేసర్లు పతిరన, దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే కీలక పాత్ర పోషించారు. జూనియర్ మలింగగా పేరుగాంచిన శ్రీలంక యువ బౌలర్ పతిరన తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ముంబయి నిర్దేశించిన 140 పరుగుల టార్గెట్‌ను చెన్నై నాలుగు వికెట్లను నష్టపోయి 17.4 ఓవర్లలోనే ఛేదించింది. మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ శ్రీలంక యువ పేసర్ పతిరనకు కీలక సూచనలు చేశాడు. ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్ జోలికి పోవద్దని, కేవలం ఐసీసీ టోర్నీల్లోనే ఆడాలని ధోనీ సూచించాడు.
‘‘పతిరన బౌలింగ్‌ను అర్థం చేసుకోవడం బ్యాటర్లకు కష్టంగానే ఉంటుంది. నిలకడైన బౌలింగ్, పేస్ అతడిని మరింత ప్రత్యేకంగా మార్చింది. అందుకే ఇప్పటికప్పుడు వెంటనే రెడ్ బాల్ క్రికెట్ (టెస్టు) జోలికి పోవద్దు. అటువైపుగా ఆలోచన కూడా చేయకపోవడం మంచిది. యువ బౌలర్ తప్పకుండా శ్రీలంక క్రికెట్‌కు గొప్ప ఆస్తిగా మారతాడు. గతేడాది ఇక్కడకు వచ్చినప్పుడు బౌలింగ్‌లో పదును లేదు. ఈసారి మాత్రం అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నాడు.